నేను గెలిస్తే.. భారత్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థి హామీలు - MicTv.in - Telugu News
mictv telugu

నేను గెలిస్తే.. భారత్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థి హామీలు

July 2, 2020

US President Candidate Joe Biden on India

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్, జోసెఫ్ బిడెన్ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాగైనా వైట్ హౌజ్ ఎంట్రీ కోసం చూస్తున్న డెమోక్రటిక్ పార్టీ తరుపు అభ్యర్థి బిడెన్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకే ట్రంప్ తరుచూ భారత్ మైత్రిపై స్పందిస్తూ ఉంటారు. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తారు. దీని కోసం ఇటీవల నమస్తే ట్రంప్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. వీటిని గమనించిన బిడెన్ తాను ఏం తక్కువ తీసిపోలేదని భారతీయులపై హామీల వర్షం కురిపించారు. 

నిధుల సమీకరణ నిమిత్తం జరిగిన వర్చ్యువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్ – యూఎస్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.తాను ఎనిమిది సంవత్సరాలు ఒబామా హాయంలో  ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఉన్నసంబంధాలే ఉంటాయని స్పష్టం చేశారు. బిడెన్ విజయం సాధిస్తే భారత్‌తో బంధాన్ని బలోపేతం చేస్తూ.. ఆ దేశానికి అత్యున్నత ప్రాదాన్యత కల్పిస్తామని చెప్పారు.  వ్యూహాత్మక భాగస్వామిగా చేస్తామన్నారు. తాను ఎప్పుడూ భారత్‌కు మద్దతు దారుడినేనని ప్రకటించారు. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే.