అమెరికన్లకు ఆ హక్కు ఉంది.. ‘గన్ కల్చర్’పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికన్లకు ఆ హక్కు ఉంది.. ‘గన్ కల్చర్’పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

June 24, 2022


అమెరికాలో తుపాకీ హింస నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అమెరికన్లకు బహిరంగంగా తుపాకులు కలిగి ఉండే హక్కు ఉందని గురువారం స్పష్టం చేసింది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌, బోస్టన్‌ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లో పౌరులు తమ వెంట తుపాకులు తీసుకుని వెళ్లొచ్చు. వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకీ కలిగి ఉండటం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ తీర్పులో రాశారు. ఈ సందర్భంగా గతంలో న్యూయార్క్‌ చేసిన చట్టాన్ని కొట్టివేసింది.

అమెరికాలో ఇప్ప‌టికే గ‌న్ క‌ల్చ‌ర్ తో ప‌లువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు..ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌లు శోచ‌నీయంగా మారాయి. టెక్సస్‌, న్యూయార్క్‌, కాలిఫోర్నియాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బైడెన్‌ సర్కారు తుపాకుల సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ చట్టం రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బైడెన్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.