అమెరికా కూడా ప్రయోగించింది.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా కూడా ప్రయోగించింది..

August 30, 2017

వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా ప్రపంచాన్ని హడలెత్తిస్తుండటం తెలిసిందే. అది ధూర్త దేశమని, ప్రయోగాలు మానుకోకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దన్న అమెరికా హెచ్చరించింది. క్షిపణులతో భయాందోళనకు  కలిగించొద్దని హితవు పలికింది. అయితే ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయనే సామెత చందంగా అమెరికా బుధవారం తాను కూడా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. యూఎస్ మిసైల్ ఢిఫెన్స్ ఏజెన్సీ, నేవీలు హవాయ్ తీరం నుంచి స్టాండర్డ్ మిస్సైల్- 6  ప్రయోగం చేపట్టారు. ఉత్తర కొరియా.. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించిన మరుసటి రోజే అగ్రరాజ్యం ఈ చర్యకు పూనుకుంది.

అమెరికా భూభాగంలోనూ దాడి చేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, వాటిని పరీక్షిస్తున్నామని ఉత్తర కొరియా ఇటీవల చెప్పడం తెలిసిందే. ఉ. కొరియాకు దీటుగా బదులిస్తామని అమెరికా కూడా హెచ్చరించింది. ఉ.కొరియాను హెచ్చరించడంలో భాగంగా తాజా పరీక్ష నిర్వహించింది.