ట్రంప్ సంచలనం.. చైనా విమానాలపై నిషేదం - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ సంచలనం.. చైనా విమానాలపై నిషేదం

June 3, 2020

 

Plane Cancellation.

కరోనా మహమ్మారిని ప్రపంచానికి అంటించిన చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా విమానాలను అమెరికాలోకి అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయించారు. ఈ నిర్ణయం జూన్ 16 నుంచి అమలులోకి రాబోతోంది. చైనాలోని వుహాన్ నగరంలో లాక్‌డౌన్ ఎత్తేశాక ఆ దేశంలో విమాన సర్వీసులు మొదలయ్యాయి. వివిధ దేశాల నుంచి విమానాలు చైనాకు వస్తున్నాయి. అయితే అమెరికాకు చెందిన విమానాలను మాత్రం చైనా అనుమతించడం లేదు. దీంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 16 నుంచి చైనా విమానాలకు ప్రవేశం లేదని వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్‌కు సంబంధించిన నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలోని 150 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. దాదాపుగా 6 రాష్ట్రాల్లో అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు. ఇదిలావుండగా.. ఓ వైపు కరోనా దేశాన్ని వణికిస్తుండగా, మరోవైపు ఇలాంటి నిరసనలు జరగడం ఆ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చైనాపై ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలి తీసుకోవడానికి చైనా నిర్లక్ష్యమే కారణం అని అమెరికా వాదిస్తున్న విషయం తెలిసిందే.