Home > Featured > US Woman : 13 ఏళ్ల పిల్లాడిపై 31 ఏళ్ల మహిళ అత్యాచారం.. కేసు తీర్పు ఇదీ..

US Woman : 13 ఏళ్ల పిల్లాడిపై 31 ఏళ్ల మహిళ అత్యాచారం.. కేసు తీర్పు ఇదీ..

US Woman Age 31, Who Gave Birth To 13-Year-Old Boy's Baby, Won't Go To Jail

ప్రేమ గుడ్డిదే, నో డౌట్. కానీ ఈ గుడ్డితనం పిల్లల విషయంలో అసలు ఉండకూడదు. ముక్కుపచ్చలారని బాలికలను ముసలోళ్లు పెళ్లి చేసుకుని వారి జీవితాలను బుగ్గి చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే బాల్య వివాహాలను చాలా దేశాలు నిషేధించాయి. అయితే ఇలాంటి నేరాలకు మగవాళ్లు మాత్రమే పాల్పడ్డం లేదు. కొందరు ఆడవాళ్ల కూడా ముక్కుపచ్చలారని అబ్బాయిలను ముగ్గులోకి దించి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తమ వద్ద పాఠాలు నేర్చుకునే అబ్బాయిలతోనే లేడీ టీచర్లు లేచిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా, లేత కుర్రాళ్లను భయపెడితే నోరుమూసుకుని పడుంటారని కొందరు ముదురు లేడీస్ కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజా అమెరికాలో అలాంటి సంఘటనే జరిగింది, తన వయసులో సగం వయసు కూడా లేని పిల్లాడితో లవ్ పేరుతో అఘాయిత్యానికి పాల్పడింది. అతని ద్వారా గర్భం దాల్చి బిడ్డను కనింది. కానీ కోర్టును ఆమెను బిడ్డ తల్లి అనే మానవతా దృక్పథంతో జైలు శిక్ష వెయ్యకుండా వదిలేసింది. దీనిపై అబ్బాయి తల్లి దుమ్మెత్తి పోస్తోంది.

పాపం, వదిలేద్దాం..

కొలరాడో రాష్ట్రంలోని ఫౌంటన్ ప్రాంతానికి చెందిన ఆండ్రియా సెరానో వయసు 31. ఆమె పొరిగింట్లో 13 ఏళ్ల పిల్లాడు ఒకడున్నాడు. వాడంటే ఆమెకు విపరీతమైన మోజు. మొదట్లో ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇంటికి పిలిపించుకుంది. వాడు కూడా ‘మామ్ మామ్’ అని దగ్గరయ్యాడు. ఆండ్రియా మొదట ముద్దుగా తాకింది. తర్వాత మోజుతో తాకింది. శారీరకంగా దగ్గరైంది. వాడు ట్రాప్‌లో పడిపోయి ఆమె ఇంట్లోనే మకాం వేశాడు. విషయం ఎవరికీ చొప్పొద్దని ఆండ్రియా బుజ్జగించడంతో సరేనన్నాడు. ఆమె గర్భం దాల్చింది. బాలుడి ప్రవర్తనలో తేడా రావడంతో అతని తల్లిదండ్రులు ఆరా తీసి ఆండ్రాయాను కోర్టుకు లాగారు. పోలీసు ఆమెను గత ఏడాది అరెస్ట్ చేశారు. ఇటీవల కోర్టు తీర్పు చెప్పింది. ఆండ్రియా ఇప్పుడు మగబిడ్డకు తల్లి కావడంతో జైలు శిక్ష విధించలేమని, అయితే ఆమెపై పదేళ్లు నిఘ పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఆండ్రియాకు పుట్టిన బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల కుర్రాడేనని స్పష్టం చేసింది.

తీర్పుపై పిల్లాడి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తోంది.

‘‘ఆండ్రియా అంత నంగనాచి అనుకోలేదు. మా వాడు ఆమెను అమ్మా అమ్మా అని పిలిచేవాడు. కన్నబిడ్డలాంటి వాడిపై ఇంత ఘోరానికి పాల్పడ్డం న్యాయమా? ఆమె నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. ఆమెను శిక్షించకుండా వదిలేయడం అన్యాయం. ఆమె స్థానంలో నా కొడుకు వుంటే ఇలాగే వదిలిపెట్టేవారా? ఏం చేస్తాం, అంతా మా ఖర్మ! ఆమెకు పుట్టిన బిడ్డను మాకే అప్పగించండి,’’ అంటోంది నాయనమ్మ.

Updated : 8 March 2023 6:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top