డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించే వారికి ఈ వార్త కాస్త ఉపయోగపడొచ్చు. ఎటువంటి పెట్టుబడి లేకుండా.. పెద్ద కష్టమేమీ పడకుండా.. ఇదిగో ఈ అమ్మడిని ఫాలో అయితే రోజుకు రూ.4 లక్షలు వెనుకేయొచ్చు. కానీ మీకు కూడా అంత పాపులారిటీ ఉండాలి మరీ. అమెరికాకి చెందిన మాజీ రియాలిటీ టీవీ స్టార్ స్టెఫానీ మాట్టో గతంలో తన పిత్తులను జార్లో బంధించి అమ్ముకుని చాలా ఫేమస్ అయింది. ఆ పిత్తులతో నెలకు రూ.1.51 కోట్ల దాకా సంపాదించేది. అయితే ఓ రోజు సడెన్గా గుండెనొప్పి రావడంతో… ఆస్పత్రిపాలైంది. పొట్టలో గ్యాస్ ఎక్కువ అవ్వడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పడంతో… ఇక ఆ గ్యాస్ వ్యాపారాన్ని ఆపేసింది.
మార్కెట్లో బిజినెస్ పడిపోతే తన వాల్యూ కూడా పడిపోతుందనుకుందేమో పాపం. వెంటనే ప్రత్యామ్నాయంగా తన వక్షోజాల నుంచి వచ్చే చెమటను జార్లలో ప్యాక్ చేసి అమ్మడం మొదలుపెట్టింది. ఈ చెమట వ్యాపారంలో ఒక్కో జార్నీ $500కి అమ్ముతోంది. అంటే మన కరెన్సీలో రూ.39,000 అన్నమాట. ఇలా రోజూ రూ.4 లక్షల దాకా సంపాదిస్తోంది. చెమట కోసం స్టెఫానీ… రోజూ 4 గంటలపాటూ వర్కవుట్లు చేస్తోంది. ఈ వ్యాపారమే ఆమెకు చాలా తేలిగ్గా ఉందట. కస్టమర్ అడగగానే… పావు గంటలో తయారుచేస్తున్నట్లు తెలిపింది.