ఇవి కూడా విమానాల్ని ఆపేశాయ్...! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి కూడా విమానాల్ని ఆపేశాయ్…!

June 21, 2017

జోరు వర్షాలు కురువడం లేదు..దట్టమైన మంచులేదు. పొగలూ లేవు..అయినా అక్కడ విమానాలు ఆగిపోయాయ్.ఎయిర్ పోర్ట్ నుంచి ఎగురలాంటేనే భయపడుతున్నాయి. ఎందుకిలా అంటే…

అమెరికాలోని అరిజోనాలో గల ఫోనిక్స్‌ నగరంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. సమ్మర్ స్టార్టింగ్ నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. సోమవారం 118 డిగ్రీల ఫారిన్‌హీట్‌, మంగళవారం 119 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఫోనిక్స్‌ స్కై హార్బర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. దాదాపు 50 విమానాలను రద్దు చేశారు. సాధారణంగా అమెరికాలో ప్రాంతీయ విమానాలు 118 డిగ్రీల ఫారిన్‌హీట్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లోనే ప్రయాణించగలవు. దీంతో విమానాలను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఎయిర్‌బస్‌, బోయింగ్‌ లాంటి పెద్ద విమానాల సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతున్నాయి. ఎయిర్‌బస్‌, బోయింగ్‌ విమానాలు గరిష్ఠంగా 127, 126 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉష్ణోగ్రతల్లోనూ నడుస్తాయి.