USA America president Joe Biden Cancer White House
mictv telugu

అమెరికా అధ్యక్షుడికి కేన్సర్.. వైట్‌హౌస్ టెన్షన్!

July 21, 2022

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు కేన్సర్ ఉందని కలకలం రేపారు. దీంతో అగ్రరాజ్య అధికార సౌధం ఉలిక్కి పడింది. నష్ట నివారణ కోసం నానా తంటాలూ పడుతోంది. ‘హై హావ్ కేన్సర్’ అని బైడెన్ చేసిన ప్రకటన తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. బైడెన్ మసాచుసెట్స్‌లోని ఓ మూతపడిన బొగ్గు గనిని సందర్శించడానికి వెళ్లి ప్రసంగిస్తూ తనకు కేన్సర్ సోకిందని వెల్లడించారు.

‘వాతావరణ మార్పులుతో ప్రమాదకరం. నాకు కేన్సర్ సోకింది. చిన్నప్పుడు మేం డెలావర్‌లో ఉండేవాళ్లం. అమ్మ కారులో తీసుకెళ్తేది. చమురు శుద్ధి ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం కారు అద్దాలపై పడేంది. దాన్ని తొలగించేందుకు వైపర్లు ఆన్ చేసేవాళ్లం. అంతటి కాలుష్య వాతావరణంలో పెరిగిన నాకు, చాలా మందికి కేన్సర్ వచ్చింది. డెలావర్ కేన్సర్‌గ్రస్థ ప్రాంతం’ అని ఆయన అన్నారు. ఈ ప్రకటనతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే బైడెన్‌కు ఇప్పుడు కేన్సర్ లేదని, గత ఏడాది అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు తీసుకున్న కేన్సర్ ట్రీట్మెంట్ గురంచే ఆయన మాట్లాడారి వైట్ హౌస్ వెల్లడించింది.