ఈ ఫస్ట్ లేడీ సంథింగ్ డిఫరెంట్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఫస్ట్ లేడీ సంథింగ్ డిఫరెంట్..!

July 17, 2017

మెరుపులా మెరుస్తుంది.ముసి ముసి నవ్వులతో మెస్మరైజింగ్ చేస్తుంది. ఎంతమంది సెలబ్రెటీలు ఉన్నా…అందరి దృష్టి ఆమెపైనే..ఇంతకీ ఎవరా మెరుపు తీగ అంటే అమెరికా ప్రథమ మహిళ మెలానియా.. ఈమె రూటే సెపరేట్..ఎందుకంటే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిక్కకు లెక్కుందో లేదో గానీ..ఫస్ట్ లేడీ ప్రతి పనికి లెక్కుంది. ట్రంప్ తో పాటు విదేశాల్ని చుట్టేస్తోన్న మెలానియా ప్రతి టూర్ లో సంథింగ్ డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. వైట్ హౌస్ లో కన్నా ఫారిన్ టూర్ లలోనే చలాకీగా ఉంటున్నారు. ట్రంప్ తో సంబంధం లేకుండా తనకు నచ్చిన పనుల్ని చేసేస్తున్నారు.

మెలానియాకి అమెరికాలో ఉండడం కంటే ఇతర దేశాల్లో తిరగడమే బాగా ఇష్టం వున్నట్లుంది. ట్రంప్ వైట్ హౌస్ లో బిజీగా ఉంటే మెలానియా ఇతర దేశాల్లో పర్యటిస్తున్నారు. లాస్ట్ వీక్ పారిస్‌లో ట్రంప్‌తో కలిసి పర్యటించిన మెలానియా కూల్ కూల్ గా కనిపించింది. ఓ హాస్పిటల్లో పిల్లలతో ఫ్రెంచ్‌లో మాట్లాడుతూ గడిపారు. కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన మెలానియా ఇప్పటివరకు డొనాల్డ్‌తో కలిసి చాలా విదేశీ పర్యటనలు చేశారు. ఈ దేశాల్లో మెలానియా పోడియంపై బహిరంగ ప్రసంగాలు చేశారు. కానీ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పటివరకు ఎక్కువగా ప్రసంగించ లేదు.

భర్త ట్రంప్ పాలించే అమెరికాలో చేయలేని పనులు మెలానియా ఇతర విదేశాల్లో చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు కొందరు. అగ్రరాజ్యంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా మీడియాతో మాట్లాడుతూ ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొత్తానికి మెలానియా రూటే సెపరేట్ కదా.