మీ భార్య అందంగా ఉందన్న ట్రంప్..! - MicTv.in - Telugu News
mictv telugu

మీ భార్య అందంగా ఉందన్న ట్రంప్..!

July 14, 2017

అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా ట్రంప్ మారలేదు..పెద్దన్నగా ఉండాల్సింది పోయి సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు. 70 ఏళ్లు పైబడిన ఆ యావ తగ్గలేదు. కుళ్లు కామెంట్లు కాంట్రవర్సీ అవుతున్నా డోంట్ కేర్. తనలోని చిలిపి ట్రంప్ ని టైమ్ దొరికినప్పుడల్లా బయటపెట్టుకుంటున్నారు. అంతేకాదు ఫారిన్ టూర్ లకు వెళ్లినప్పుడు ఆ దేశ ఫస్ట్ లేడీల్ని వదల్లేదు…ఇంతకీ ఫ్రాన్స్ ఫస్ట్ లేడీని ఏమన్నాడో తెలుసా…?

ఫ్రాన్స్ టూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫ‌స్ట్ లేడీ మెలానియాతో క‌లిసి పారిస్‌లోని హోట‌ల్ డెస్ ఇన్‌వాలిడెస్‌లో ఫ్రెంచ్ అధ్య‌క్షుడు మాక్రాన్‌, ఆయ‌న భార్య బ్రిగిట్టీల‌ను క‌లిశారు ట్రంప్‌. మాక్రాన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆయ‌న భార్య‌తోనూ మాట్లాడారు. ఫ్రెంచ్ ఫ‌స్ట్ లేడీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతూ… ఇంకా ఫిట్‌గా, ఎంతో అందంగా ఉన్నారంటూ మెచ్చుకున్నారు. యు ఆర్ ఇన్ స‌చ్ ఎ గుడ్ షేప్‌.. బ్యూటీఫుల్ అంటూ ఇటు బ్రిగిట్టీతో అంటూ.. మాక్రాన్ వైపు చూశారు. ఈ వీడియోను ఫ్రెంచ్ ప్ర‌భుత్వం త‌మ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ట్రంప్ ప్ర‌శంస‌ను హుందాగా స్వీక‌రించిన బ్రిగిట్టీ.. న‌వ్వి ఊరుకున్నారు.

ఈమె సరదాగా తీసుకున్నా సోషల్ మీడియా మాత్రం ట్రంప్ ఏకి పారేస్తోంది. అవి సెక్సిస్ట్ కామెంట్స్ అని దుమ్ముదులిపేస్తున్నారు నెటిజన్లు.కాంట్రావర్సీ కామెంట్లతో అమెరికా అధ్యక్ష పదవికే చెడ్డపేరు తెస్తున్నారని అంటున్నారు.