Usain Bolt in cricket..first match in India
mictv telugu

క్రికెట్‌లోకి ఉసేన్ బోల్ట్..మొదటి మ్యాచ్ ఇండియాలోనే

September 17, 2022

ప్రపంచవ్యాప్తంగా ఉసేన్ బోల్డ్ పేరు తెలియని వారుండరు. ఉసేన్ బోల్ట్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది పరుగుల పందెం. చిరుత పులిని తలపించే వేగంతో పరుగెత్తి, ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. అంతేకాదు, పరుగుల పందెంలోకి అడుగుపెట్టాలని కలలుకంటున్న వారికి ఆదర్శంగా నిలిచి, చరిత్ర సృష్టించాడు. అటువంటి ఉసేన్ బోల్ట్‌..తాజాగా ఓ సంచలన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే క్రికెట్‌‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించాడు.

ప్రపంచవ్యాప్తంగా పరుగుల వీరుడిగా పేరుగాంచిన బోల్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం ఏంటీ అని అనుకుంటున్నారా.. అథ్లెట్‌గా రిటైర్ అయిన తర్వాత బోల్ట్ క్రికెట్‌‌లోకి అడుగుపెట్టాలని గతంలోనే బోల్ట్ నిశ్చయించుకున్నాడట. దానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ”చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. క్రికెట్‌పై అమితమైన ప్రేమ ఉన్నప్పటికి, పరిస్థితుల దృష్ట్యా అథ్లెట్‌గా మారాల్సి వచ్చింది. తాజాగా క్రికెటర్ అవ్వాలన్న కలను త్వరలోనే నెరవేర్చుకోబోతున్నాను. ఇప్పటికే క్రికెటర్‌గా మారడానికి క్రికెట్ కోచింగ్ పాఠాలు వింటూ ప్రాక్టీస్లో బిజీ అయ్యాను. ఇండియా మొట్టమొదటి లైవ్ డిజిటిల్ స్పోర్ట్స్ ఛానెల్ ‘పవర్ స్పోర్ట్స్’ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగో బోల్ట్ ఆడనున్నాను. ఇప్పటికే టోర్నీ నిర్వాహకులు నాకు ఆహ్వానం పంపారు. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఆ మ్యాచ్‌ల్లో నేను కూడా ఆడబోతున్నాను. నా కలను నేరవేర్చుకోబోతున్నాను” అని బోల్ట్ రాసుకొచ్చారు.

ఇక, లీగ్‌లో పాల్గొననున్న ఎనిమిది జట్లు ఇవే..’ఇండియన్ సప్పెర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్, శ్రీలంక వైలెట్స్” అని పేర్లు పెట్టారు. కాగా, ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్బాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు. మొదటి ఎడిషన్ ఇండియాలో జరపనున్న నిర్వాహకులు.. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు.