ఉసేన్ బోల్ట్‌కు పండంటి ఆడపిల్ల  - MicTv.in - Telugu News
mictv telugu

ఉసేన్ బోల్ట్‌కు పండంటి ఆడపిల్ల 

May 20, 2020

djg

తన పరుగుతో జమైకా చిరుతగా పేరు సంపాధించుకున్న ఉసెన్ బోల్ట్ తండ్రి అయ్యాడు. దీంతో ఇంట్లో సందడి నెలకొంది. బోల్ట్ భార్య కాసీ బెన్నెట్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.కింగ్ స్టన్ లోని ఓ ఆస్పత్రిలో వీరికి బిడ్డ పుట్టడంతో ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన జమైకా ప్రధాని ఆండ్రూ హూల్నెస్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు కూడా ఆ చిన్నారిని ఆశీర్వదించారు.  సోమవారమే పాప జన్మించినట్టుగా ఇటీవల వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 

100మీటర్ల పరుగులో బోల్ట్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. 2008,2012,2016 సంవత్సరాల్లో వరుసగా బంగారు పతకాలు గెలుచుకున్నాడు. దశాబ్దకాలం పాటు ఎవరు అతన్ని అందుకోలేకపోయారు. అతడు పాల్గొన్న ప్రతి పోటీలో బంగారు పతకాలను సొంతం చేసుకున్నాడు. 2017లో అతడు రిటైర్డ్ అయ్యాడు. IAAFప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్స్ అతనికి చివరిది. కాగా ఇటీవలే బోల్ట్ సోషల్ మీడియా వేధికగా తాను తండ్రి కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే తమకు ఆడబిడ్డ జన్మించబోతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.