Home > Flash News > తెలంగాణ విజన్ సూపర్-పెట్టుబడులకు రెడ్ కార్పెట్

తెలంగాణ విజన్ సూపర్-పెట్టుబడులకు రెడ్ కార్పెట్

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ టెలికాం దిగ్గజాలైన నోకియా, ఎరిక్ సన్ కంపెనీలను కోరారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని, దీని వల్ల టెలి కమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యులయ్యేందుకు నోకియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది.
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీరామారావు అమెరికా టూర్ బిజీబిజీగా సాగుతోంది. మూడోరోజు శాన్ ప్రాన్సిస్కోలో పలు కంపెనీలతో సమావేశమయ్యారు. నోకియా, ఎరిక్ సన్ సంస్దలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి వివరించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో భాగస్వాములయ్యేందుకు నోకియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది.త్వరలోనే ఫైబర్ గ్రిడ్ కోసం జారీ చేయబోయే అర్ యఫ్ పిలో పాల్గొంటామని తెలిపింది.

తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డాటా అనాలిటిక్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ నోకియాను కోరారు. తెలంగాణలో నోకియా మొబైల్ పరికరాల తయారీ ప్లాంట్ లేదా అర్ అండ్ డి సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు ఎరిక్ సన్ కంపెనీని సందర్శించి అక్కడి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను పరిశీలించారు కేటీఆర్.

ఇంటర్ నెట్ అనుసంధానం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఈ రంగంలో ఎరిక్ సన్ చేస్తున్న పలు పరిశోధనలను పరిశీలించారు.
యూయస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కెటి రామారావు
పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రాధాన్యతలు, అవకాశాలు అనే అంశంపై ముఖాముఖి సంభాషించారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అత్యుత్తమ వ్యాపార విధానాలను అమలు పరుస్తున్నదని ఆయన తెలిపారు. ప‌రిశ్రమ‌లు, సోలార్ , ఐటి రంగాల‌ పైన పలువురు అడిగిన ప్రశ్నల‌కు స‌మ‌ధానాలిచ్చారు.

ఆతర్వాత మ్యూల్ సాప్ట్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృదంతో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కంపెనీ విస్తరణ అవ‌కాశాలపై చ‌ర్చించారు. తెలంగాణ రాష్ర్టంలో గ‌త మూడు సంవత్సరాల్లో వ‌చ్చిన పెట్టుబ‌డుల‌ను వివ‌రించారు. గ్రోత్ రేట్ వేగంగా పెరుగుతుందన్నారు. కంపెనీ విస్తరణ అవకాశాలు పరిశీలిస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని సైతం తమ ప్రణాళికల్లో ఉంచుతామని మంత్రికి మ్యూల్ సాప్ట్ ప్రతినిధులు హమీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం అభివృద్ది చెందిన తీరుని కంపెనీ ప్రతినిధులు ప్రశంసించారు.


స్టార్టప్ కంపెనీలకు సేవలందించేందుకు స్రైప్(Stripe) కంపెనీతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా అర్దిక సేవలు అందించే ఈ కంపెనీ ప్రతినిధులకు డిజిటల్ ట్రాన్స్ టాక్షన్స్ లో తెలంగాణ మెదటి స్ధానంలో ఉన్నదని వివరించారు. డిమాటైజేషన్, అర్ధిక లావాదేవీల డిజిటలైజేషన్ నేపథ్యంలో స్రైప్ కంపెనీ విస్తరణకు అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలో కంపెనీలు ప్రారంభిచాలనుకునే వారికోసం తమ కంపెనీ ప్రొడక్ట్ అయిన అట్లాస్ తో సహాకారం అందిస్తామని వారు మంత్రి తో చెప్పారు. ఈ మేరకు అత్యధిక స్టార్ట్ అప్స్ ఉన్న టిహబ్ ద్వారా కలసి పనిచేస్తామని, సిలికాన్ వ్యాలీలో టి హబ్ ఏర్పాటు చేసిన టి బ్రిడ్జ్ తో కలిసి పనిస్తామని కంపెనీ తెలిపింది.

సేల్స్ ఫోర్సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సేల్స్ ఫోర్సు Fireside chat పేరుతో జరిగే ఈ సంభాషణలో మంత్రి తెలంగాణ రాష్ర్టంతో పాటు పలు వ్యాపారావకాశాలు, ఐటి పరిశ్రమ భవిష్యత్తు వంటి అంశాలపైన ముఖాముఖి చర్చించారు. మంత్రితో జరిగిన ఈ సంభాషణ తమకు ఎంతో ఉత్సాహం కలిగించిందని సేల్స్ ఫోర్స్ కంపెనీలు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Updated : 24 May 2017 5:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top