18 ఏళ్లలోపువారికి అక్కడ మొబైల్ ఫోన్స్ నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

18 ఏళ్లలోపువారికి అక్కడ మొబైల్ ఫోన్స్ నిషేధం

November 18, 2022

ప్రస్తుత కాలంలో పిల్లలపై స్మార్ట్ ఫోన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే పిల్లలు పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు బయటకు వెళ్లి ఆడుకునే వారు..ఇప్పుడు పూర్తిగా ఫోన్‌లోనే మునిగిపోతున్నారు. కొంతమంది విద్యార్థులు చదువును తగ్గించి ఫోన్‌లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి ఇబ్బందులు పడుతున్న వారిని సైతం మనం ఈ మధ్య చూస్తున్నాం. దీనికి తోడు కోవిడ్ నుంచి ఆన్ లైన్ క్లాసులు పేరుతో ఫోన్‌కు విద్యార్థులు మరింత దగ్గరయ్యారు. ఇలా మొబైల్ ఫోన్‌లకు బానిసులుగా మారిపోతున్న పిల్లలను చూసి ఓ గ్రామ సర్పంచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ ఊరి పెద్దలతో మాట్లాడి ఓ రూల్ పెట్టాడు.

18 ఏళ్లలోపువారు మొబైల్ ఫోన్ వాడకూడదని మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా బన్సి గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు తీర్మానించారు. ఎవరైనా ఫోన్‌లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదువుల కోసం ఫోన్లు తీసుకొని పిల్లలు సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, వారి భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఇతర సైట్లు చూస్తూ చెడిపోతున్నారని అందుకే ఈ రూల్ పెట్టినట్టు వివరించాడు. ఇది వారి స్వేచ్ఛను హరించడానికి కాదని సర్పంచ్ గజానన్‌ స్పష్టం చేశారు. మెబైల్ ఫోన్స్ పై నిషేధం విధించిన మొదటి పంచాయతీగా తమ గ్రామం నిలుస్తుందని తెలిపారు. దీనిపై తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నాడు.