Home > Featured > పార్లమెంట్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం

పార్లమెంట్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం

Use of non reusable Plastic Items in Parliament

భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పార్లమెంట్‌లో పునర్వినియోగపరచలేని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించారు. మంగళవారం పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ మేరకు నిన్న ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల జరిగిన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ప్రధాని ప్రసంగిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతి లోపు భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దీంతో పార్లమెంట్‌లో పునర్వినియోగపరచలేని ప్లాస్టిక్‌ను నిషేధించారు. పార్లమెంట్‌లో పనిచేసే ఇతర సంస్థలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని, వారు కూడా ప్లాస్టిక్ వాడకూడదని పార్లమెంట్ సెక్రటేరియట్ తెలిపింది. పునర్వినియోగపరచగలిగే ప్లాస్టిక్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

Updated : 21 Aug 2019 5:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top