Users leaving Twitter and switching to Mastodon
mictv telugu

మస్క్ మామ దెబ్బకు మాస్టోడాన్‌కి మారిపోతున్న యూజర్లు

November 8, 2022

Users leaving Twitter and switching to Mastodon

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. అందులో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్కులకు డబ్బులు కట్టాలనడం ఇందులో ప్రధానంగా ఉన్నాయి. భారీ ధరకు కొన్న మస్క్.. ఆ డబ్బులను రాబట్టుకోవడానికి తగిన ప్రణాళికలు రచిస్తుండగా, యూజర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు ఇతర ప్లాట్‌ఫారంలకు మారిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా మాస్టోడాన్ అనే మైక్రో బ్లాగింగ్ సైట్‌‌కి తరలిపోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. గత వారం రోజుల్లోనే 2 లక్షల 30 వేల మంది యూజర్లు మాస్టోడామన్‌కి మారిపోయారని తెలిపింది. మాస్టోడాన్ ట్విట్టర్ కంటే కొంచెం భిన్నమైంది. ట్విట్టర్‌లో 280 అక్షరాల పరిమితి ఉండగా, ఇందులో అది 5 వేలుగా ఉంది. దీంట్లో వివిధ భాషలకు వివిధ సర్వర్లుంటాయి. ఇది ఫ్రీ సర్వీసును కలిగి ఉంది. అయితే ఫేస్బుక్, ట్విట్టర్ లాగా భారీ నిధులు ఈ కంపెనీకి ఉండవన్న సంగతి గమనించాలి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయస్సు 18 ఏళ్ల ఉండగా, ఒకేసారి ఒత్తిడి మీద పడడంతో సర్వర్లు నెమ్మదిగా పని చేస్తున్నాయి. ఇందులో టెక్ట్స్‌‌తో పాటు ఫోటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేయవచ్చు. అయితే ట్విట్టర్ మాదిరి అన్ని ఫీచర్లు ఉండవు. ఇందులో ఎలాంటి యాడ్స్ రాకున్నా.. బ్లూటిక్ మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నట్టు కనిపించడం లేదు. లోడ్ అయ్యే టైం ఎక్కువగా ఉండడం, నోటిఫికేషన్లు ఆలస్యంగా రావడం వంటి ఫిర్యాదులు దీనిపై ఉన్నాయి. అయితే అనుకోకుండా ట్రాఫిక్ పెరగడంతో సంస్థ మరింత మంది టెకీలను నియమించి యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనుందని చెప్తున్నారు.