విమానమే నడపలేని ఉత్తమ్ .. కాంగ్రెస్ పార్టీకి నాయకుడా? మాజీ సైనికుడు... - MicTv.in - Telugu News
mictv telugu

విమానమే నడపలేని ఉత్తమ్ .. కాంగ్రెస్ పార్టీకి నాయకుడా? మాజీ సైనికుడు…

October 10, 2018

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై  మాజీ సైనికుడు బోయినపల్లి ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు.  ఉత్తమ్ వల్లే భారత్ వాయుసేనకు చెందిన రెండు యుద్ద విమానాలు కూలిపోయాయని అన్నారు. దాంతో ప్రభుత్వానికి రూ. 500 కోట్ల నష్టం ఏర్పడింది. విమానాలే సక్రమంగా నడపరాని ఉత్తమ్, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాడని హేళన చేశారు.

‘విమానాలు కూలిపోయిన ఘటనలో ఉత్తమ్ 3నెలలు విచారణను ఎదుర్కున్నారు. అప్పుడాయన కెరియర్  గందరగోళంగా సాగింది. ప్యారచూట్ సాయంతో సరిగా జంప్ చేయలేకపోవడంతో ఉత్తమ్ వెన్నెముకకు దెబ్బ తగిలింది. చివరకు అధికారులను మేనేజ్ చేసుకుని రాష్ట్రపతి భవన్‌లో ఏడీసీ అధికారిగా చేరాడు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఉత్తమ్ రాష్ట్రపతి భవన్‌లో పనిచేశాడు.

Boinapally Prabhakar rao fires on uttam kumar reddy over comments ..

1979లో పంజాబ్‌లోని ఆదంపూర్‌లో నేను ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా ఉంటే, ఉత్తమ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పనిచేశాడు. ఐఏఎఫ్‌లో పైలెట్‌ను కెప్టెన్ అని పిలవరనీ, ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తారు. కేవలం బ్రిటిష్ ఆర్మీలో మాత్రమే పైలెట్లను ఫ్లైట్ కెప్టెన్ అంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా మాట్లాడితే మాజీ సైనికులు ఉత్తమ్ సంగతి చూసుకుంటారు. కరీంనగర్ మాజీ సైనికుల హౌసింగ్‌బోర్డు అధ్యక్షుడిగా  నేను ఉన్నప్పుడు ఇండ్ల కోసం ఆయన చుట్టూ తిరిగాం. రూ.1200 కోట్ల ఇళ్ల కుంభకోణంలో ఉత్తమ్‌ హస్తం ఉంది’అంటూ ఉత్తమ్ పై తీవ్రంగా ఆరోపణలు చేశారు.