ఉత్తమ్ హుజూర్ నగర్‌లోనే ఉండొచ్చు.. ఈసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమ్ హుజూర్ నగర్‌లోనే ఉండొచ్చు.. ఈసీ

October 20, 2019

రేపే హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగనుంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇక ఎవరు గెలిచేది అని చెప్పే ఎన్నికల సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో స్థానికేతరులంతా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లా ఎస్పీ ఫోన్ చేసి హుజూర్ నగర్ నుంచి వెళ్లాలని చెప్పారు. అయితే, ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

Uttam kumar reddy.

తాను హుజూర్ నగర్ స్థానికుడినని, నల్గొండ ఎంపీనని కాబట్టి హుజూర్ నగర్‌లో ఉండేందుకు తనకు అవకాశం కల్పించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించింది. ఉత్తమ్‌కు హుజూర్ నగర్‌లోనే ఉండేందుకు ఈసీ  అనుమతులు ఇచ్చింది. ఈ విషయం తెలియని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అక్కడినుంచి వెళ్లాలని చెప్పారు. అందుకు ఆయన ఇక్కడే ఉండేందుకు ఈసీ తనకు అనుమతి ఇచ్చిన విషయం గురించి పోలీసులకు చెప్పారు. ఈసీ ఇచ్చిన లేఖను కూడా వారికి చూపించారు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.