మోడీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుంది..

August 9, 2017

ఆర్ఎస్ఎస్ వారసులు క్విట్ ఇండియా గురించి మాట్లాడడం అని  విడ్డూరం అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.,ఎఐసిసి వేదిక నుండి క్విట్ ఇండియా ఉద్యమం పురుడు పోసుకుంది.క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ జాతీయ నాయకులు జైలుకు వెళ్లారు., క్విట్ ఇండియా మూమెంట్ లో భారతీయుల్ని బ్రిటిష్ వాళ్లు నానా చింత్ర హింసలు పెట్టారు. ఆరెస్సెస్ ,హిందూ మహాసభ చెందిన ఏఒక్కరు.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటీష్ వాళ్లతో పనిజేశారు. క్విట్ ఇండియా సమయంలో 14 ఏళ్ళు జైల్లో ఉన్న నెహ్రు పేరు మోడీ ప్రస్తావించకుండ పోవడం దురదృష్ట్.క్విట్ ఇండియా ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుంది,

నాటి ఆరెస్సెస్ చీఫ్ హెడ్గేవార్.. గోల్వాల్కర్  బ్రిటిష్ వాళ్లకు మద్దతుగా పనిచేసిన సంగతి నిజం కాదా..?బిజెపి సిద్ధాంత కర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జి సైతం బ్రిటిష్ కు మద్దతు పలికారు.చరిత్ర ను వక్రీకరించి మోడీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది.నాడు బ్రిటిష్ వారికి సహకరించిన వారు.. నేడు డ్రామాలాడుతున్నారు. మోడీ పాలనలో మైనార్టీ గిరిజనులు, భయం భయం తో బతుకుతున్నారు.తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన యదేచ్చగా జరుగుతుంది అట్టడుగు వర్గాల తరుపున కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుంది.క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  గాంధీభవనలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి..క్విట్ ఇండియా గురించి,ఆర్ ఎస్ ఎస్ ,మోడి గురించి తనదైన శైలిలో స్పందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.