యూపీలో మరో అత్యాచారం.. 8 ఏళ్ల బాలికపై.. - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో మరో అత్యాచారం.. 8 ఏళ్ల బాలికపై..

October 1, 2020

Uttar Pradesh 8 Year Old Girl

యూపీలో అత్యాచారాల పర్వం ఏ మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇటీవలే హత్రాస్‌లో అత్యంత పాశవికంగా జరిగిన ఘటన మర్చిపోక ముందే మరొకటి చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అజమ్‌ఘడ్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటనపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకొని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

దినేశ్‌(20) ఇంటి పక్కనే ఉన్న చిన్నారికి స్నానం చేయిస్తానని ఆమె తల్లితో చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడే లైంగిక దాడికి ఒడిగట్టాడు. కొంత సేపటికి ఆమె ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. అప్పటికే రక్తస్రావం అవుతుండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పక్కనే ఉండే వ్యక్తి కదా అని నమ్మితే ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఆ తల్లి వాపోతోంది.