లాక్‌డౌన్ లో స్కూల్ ఫీజ్ అడిగితే జైలుకే - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ లో స్కూల్ ఫీజ్ అడిగితే జైలుకే

April 5, 2020

Uttar pradesh bans fees collection by private schools till lockdown is over

లాక్ డౌన్ కారణంగా దేశమంతా స్తంభించిపోయింది. స్కూల్స్, థియేటర్లు, పరిశ్రమలు, ఆఫీస్ లు అన్నీ మూతపడిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమిత మయ్యారు. బ్యాంకు ఈఎంఐలు, ఇళ్ల అద్దెలపై కేంద్రం ప్రజలకు ఉపశమనం కల్పించిన సంగతి తెల్సిందే. అయితే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మాత్రం ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వేధిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా కలెక్టర్ సుహాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో స్కూల్ ఫీజ్ అడిగితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయినా కూడా వినకుండా ఫీజ్ కోసం విద్యార్ధుల తల్లిదండ్రులను ఇబ్బందిపెడితే రెండేళ్ల జైలు తప్పదని హెచ్చరించారు. గౌతమ్ బుద్ధ్ నగర్‌ నగర్ స్కూల్ ఫీజ్‌ల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి గౌతమ్ బుద్ధ్ నగర్‌ నగర్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే హర్యానా ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు వాసులు చేయడం పై తాత్కాలికంగా బ్యాన్ విధించింది.