సీఎం యోగి సూపర్..పది పాసైతే బాలికలకు పదివేలు..! - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం యోగి సూపర్..పది పాసైతే బాలికలకు పదివేలు..!

June 7, 2017

బంగారు తల్లి భారం కాదు వరం.. అమ్మాయిలు ఉంటే ఆ ఇంట్లో నిత్య వెలుగులే.అమ్మాయి ఉన్న ఆ ఇంట్లో సందడి వేరు. కానీ కొందరు ఆడపిల్లలనగానే భారంగా ఫీలవుతున్నారు. కడుపులో ఉండగానే కొందరు వద్దనుకుంటే..మరికొందరు పెద్దయ్యాక..పెద్ద చదవులు ఎందుకు లే అనుకుంటున్నారు. అందరూ ఇలా కాకున్నా కొందరు మాత్రం అలా ఆలోచిటం వాస్తవం. మరికొందరైతే కొడుకుని కార్పొరేట్ స్కూల్ కు , బిడ్డని మామూలు స్కూల్ కు పంపుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతూనే వస్తోంది. బేటి పడవో బేటి బచావో నినాదం ఎఫ్టెక్ ఉందో లేదో కానీ… యూపీ సీఎం యోగి తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం మాత్రం ప్రజలపై ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.

బాలిక విద్య‌ను ప్రోత్స‌హిస్తూ ప‌దో త‌ర‌గ‌తి పాస‌య్యే అమ్మాయిల‌కు రూ.10 వేలు క్యాష్ అవార్డు ఇవ్వాల‌ని యూపీ సర్కార్ నిర్ణ‌యించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 45వ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దినేశ్ శ‌ర్మ ప్ర‌క‌టించారు. సుమారు ల‌క్ష మంది అమ్మాయిల‌కు ప‌దివేల న‌గ‌దు ఇస్తారు. నిజంగా ఇది పై చదువులకు ఉపయోగపడేంత కాకపోయినా… ఏదో కొంత ఊరటనిస్తుంది. బాలికలను ప్రొత్సహిస్తుంది. పై చదువులు చదివేలా..డ్రాపావుట్స్ ను తగ్గించేలా ఉపయోగపడుతుంది. పేదల కుటుంబాలకు ఎంతో కొంత ఆసరా అవుతుంది. ఇందులో నో డౌట్..సో టెన్త్ గర్ల్స్ ఆల్ ది బెస్ట్..