Home > Featured > డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు యువకున్ని చితకబాదిన పోలీసులు

డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు యువకున్ని చితకబాదిన పోలీసులు

నడిరోడ్డుపై పోలీసులు దారుణంగా రెచ్చిపోయారు. ఓ యువకుడిని ఇష్టం వచ్చిన్నట్టుగా చితకబాదారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రింకూ పాండే అనే యువకుడిని నడిరోడ్డుపై దారుణంగా హింసించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. తానేం తప్పుచేశానంటూ యువకుడు మొత్తుకున్నా వినిపించుకోకుండా కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఎస్ఐ సహా హెడ్ కానిస్టేబుల్‌న సస్పెండ్ చేశారు.

రింకూ పాండే ఓ చిన్న పిల్లోడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరేంద్ర మిశ్రా, హెడ్‌ కానిస్టేబుల్‌ మహేంద్ర ప్రసాద్‌ బైక్ ఆపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర పత్రాలు చూపించాలని కోరారు. అయితే అతని వద్ద లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు బైక్ తాళాలు లాక్కున్నారు. అతను చెప్పిన మాట వినిపించుకోకపోవడంతో మాట మాట పెరిగింది. కోపంతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఆ యువకుడిని నేలపై పాడేసి కాళ్లతో తన్నుతూ మీద కూర్చొని హింసించారు. నడిరోడ్డుపై పోలీసులు ఇలా రౌడీల్లా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Updated : 13 Sep 2019 12:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top