కాళిమాతను అడ్డుకున్న గూండాలు.. మతం మారిపోతాం.. - MicTv.in - Telugu News
mictv telugu

కాళిమాతను అడ్డుకున్న గూండాలు.. మతం మారిపోతాం..

October 11, 2018

మనదేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకు ముందుకు దూసుకు పోతోంది. దళితులపై వివక్షలో అంతకంటే వేగంతో ముందుకెళ్తోంది. తమ కాలనీలోని గుడిలో కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబోయిన దళితులను గూండాలు అడ్డుకున్నారు. విగ్రహం పెడితే చంపేస్తామని బెదిరించారు. దీంతో దళితులు కూడా తిరగడబడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వకపోతే హిందూ మతం నుంచి వేరే మతంలోకి మారిపోతామని హెచ్చరించారు.Uttar Pradesh: Denied installation of idol in temple, 100 Dalit families threaten conversion says 'We are Hindus, if we can't put a goddess idol in a temple then where should we go? its better to convert'కులగోడల అడ్డా అయిన యూపీలోని మీరట్ జిల్లా ముస్సోరీలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రుల సందర్భంగా స్థానిక గుడిలో కాళీ విగ్రహాన్ని దళితులు ప్రతిష్టించాలని అనుకున్నారు. దీనికి స్థానిక గూండాలు ఒప్పుకోలేదు. దీనిపై ఆగ్రహించిన 100 దళిత కుటుంబాలు జిల్లా కలెక్టర్‌ను కలిశారు.. ‘మేము కూడా  హిందువులమే కదా. గుడిలో మేం విగ్రహాన్ని పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు హిందూ మతంలో ఎందుకుండాలి? ’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.