లేడీ సింగం..ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే..! - MicTv.in - Telugu News
mictv telugu

లేడీ సింగం..ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే..!

June 28, 2017

ఎవడికి అడ్డంపడి కేసు పెడితే వాడి మైండ్ బ్లాక్ అవుతుందో ఆమె లేడీ సింగం. ఎదురుపడిందంటే మాటల్లేవు కేసులే…రూల్స్ బ్రేక్ చేస్తే కటకటాలే. పవర్ లో ఉన్నోడైనా..మరేవాడైనా ఆమె ముందు తోకజాడిస్తే అంతే. ఇంతకీ పవర్ పుల్ లేడీ ఫోలీస్ ఆఫీసర్ ఎవరు…?ఏం చేసిదంటే…

శ్రేష్ఠా ఠాకూర్‌..యూపీలోని బులంద్‌షహర్‌లో పోలీస్ సర్కిల్ ఆఫీసర్. ఈమె గురించి ఆ లెవల్లో ఇంట్రడక్షన్ అవసరమా అంటే అవసరమే. పవర్ లో ఉన్నోడి బెండు తీసిన ఈమె మెచ్చుకోవాల్సిందే. నూటికో పోలీసాఫీసర్ ఇలా ఉంటారు. లాస్ట్ వీక్ లో జరిగిన ఘటనే అయినా సోషల్ మీడియాను ఊపేస్తోంది. షేర్ లు మీదషేర్ లు చేస్తూ సపోర్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

టాపిక్ లోకి వస్తే… బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని శ్రేష్ఠా ఠాకూర్‌ ఆపింది. అతని దగ్గర లైసెన్స్ లేదు. తాను అధికారపార్టీ బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తనన్నాడు. అయినా చలానా రాసి రూ.2 వేలు ఇవ్వాలని చెప్పిందామె.దీంతో రెచ్చిపోయిన అతను శ్రేష్ఠతో పాటు ఉన్న కానిస్టేబుల్‌పై కేకలు వేశాడు. అదరక, బెదరక ఆమె వాడ్ని బొక్కలో వేసింది. కోర్టు ముందు హాజరుపరిచింది. అక్కడా నోరు జారితే మరో సెక్షన్‌ వేసి జైల్లో పెట్టింది. ఇది తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు స్టేషన్‌ముందు ధర్నాకు దిగారు. చుట్టుముట్టిన వారందరికి శ్రేష్ఠ దిమ్మదిరిగిపోయే ఆన్సార్ ఇచ్చింది. ‘రాత్రి ఇంట్లో పిల్లాపాపల్ని వదిలేసి ఇక్కడికొచ్చేది ఆట్లాడటానికి కాదు. మా విధులు మేం చేయడానికి. సరైన పత్రాల్లేకుండా బండి నడిపితే చర్యలు తీసుకోవడం మా డ్యూటీ. పోలీసులు వాళ్ల విధులు చేయాల్సిన అవసరం లేదు అని సీఎం నుంచి లేఖ తీసుకురండి. అప్పుడు నేను పనిచేయడం మానేస్తా..’ అని చెప్పింది. పైగా అధికారపార్టీ అని ఇలా ప్రవర్తిస్తే జనం మిమ్మల్ని గూండాలంటారు జాగ్రత్త అనీ వార్నింగ్ ఇచ్చింది. ఈ సీన్ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిజంగా ఈ పోలీసాఫీసర్ కు సెల్యూట్ చేయాల్సిందే. అప్పుడో ఇప్పుడో ఎవరో ఒకరు ఇలా అచ్చంగా పోలీస్ పవర్ చూపిస్తారు. కామన్ గా అధికార పార్టీ వాళ్లతో ఏ పోలీస్ పెట్టుకోడు. ఎందుకంటే సీన్ సితార అవుతుందని.. కానీ శ్రేష్టా ఠాకూర్ డోంట్ కేర్ అంది. అందరి పోలీసులూ ఇలాగే ఉంటే ఎంత బాగుండునో కదా..కిపిటప్ లేడీ సింగం.