యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేతపై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేతపై కాల్పులు

August 11, 2020

Uttar pradesh Former BJP District Head

యూపీలో బీజేపీ కీలక నేతపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్‌పత్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు  సంజయ్‌ ఖోఖర్‌ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం ఉదయం పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

సంజయ్ సంజయ్‌ ఖోఖర్‌ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అంతకు ముందే మాటు వేసిన దుండగులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆయన శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడు పొలంలో రక్తపు మడుగులో పడిపోయారు. పాతకక్ష్యలే దీనికి కారమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా  అంతకు ముందు బాగ్‌పట్‌లో ఇదే తరహాలో ఆర్‌ఎల్‌డి సీనియర్ నాయకుడు డెస్ఫాల్ ఖోఖర్ హత్యకు గురయ్యారు. అధికార పార్టీ నేతపై ఇలాంటి దాడి జరగడం సంచలనం రేపింది. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.