12 పనిగంటలపై వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

12 పనిగంటలపై వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి

May 16, 2020

work....

లాక్‌డౌన్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికంటూ పనిగంటలు పెంచేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలహాబాద్ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో పెంచిన పనిగంటల ఆర్డినెన్సును వాపసు తీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులు రోజుకు 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించడం తెలిసింది. అయితే ఇది కార్మిక చట్టాలను కాలరాయడమేని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీవ్ర ఆక్షేపణ తెలుపుతూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 

దీంతో కేసు తదుపరి విచారణకు రాకముందే ప్రభుత్వం 12 గంటల పనిదినాన్ని వెనక్కి తీసుకుంది. కార్మిక చట్టాలకు సంబంధించి తాము చేసిన ఇతర సవరణలు మాత్రం అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. చైనాతోపాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి యూపీ ప్రభుత్వం పలు కార్మిక చట్టాలను సవరించింది.