సీన్ రివర్స్.. ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

సీన్ రివర్స్.. ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి 

October 26, 2019

Uttar Pradesh lovers 

ప్రేమించడం లేదని, ముఖం చాటేసిందని, మోసం చేసి, వేరే అబ్బాయిని ప్రేమిస్తోందని.. యువకులు యువతులపై యాసిడ్ దాడితో నానా అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. మోసం ఎక్కడైనా మోసమే. ఆగ్రహం ఎక్కడైనా ఆగ్రహమే. తనతో ప్రేమాయణం సాగించి, తర్వాత ముఖం చాటేశాడంటూ ఓ యువతి తన ప్రేమికుడి ముఖంపై యాసిడ్ చల్లేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఈ దారుణం జరిగింది. 

 జీవన్‌ఘడ్‌కు చెందిన ఫైజద్‌ ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ చిలకాగోరింకల్లా గడిపారు. కానీ ఫైజద్ తర్వాత ముఖం చాటేశాడు. నెల రోజులు నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చెయ్యడం లేదు. దీంతో సదరు ప్రియురాలి అతని దగ్గరికెళ్లి నిలదీసింది. తనను ప్రేమించి మోసం చేస్తావా అని ప్రశ్నించింది. ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోయిందని, ఇప్పుడ పెళ్లికి నిరాకరిస్తే తన గతేం కాను అని వాపోయింది.  ఫైజద్ నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో ఆమె తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతని ముఖంపై చల్లేసింది. ఫైజద్ ముఖం కాలిపోయింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు పెట్టాడు.