మాటలకందని ఘోరం.. ఏం చేశాడో తెలిస్తే వణికిపోతారు! - MicTv.in - Telugu News
mictv telugu

మాటలకందని ఘోరం.. ఏం చేశాడో తెలిస్తే వణికిపోతారు!

December 3, 2019

మహిళలు ఒంటరిగా కనిపిస్తేనే కాదు, ఇంట్లో ఉన్నా రక్షణ లేకుండా పోతోంది. పక్కనే భర్త ఉన్నా కామాంధులకు బలి కావాల్సి వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దుర్మార్గుడు అత్యంత హేయమైన నేరాలకు పాల్పడుతున్నాడు. మహిళలను చంపేసి, వారి మృతదేహాలపై అత్యాచారాలకు తెగబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అతని ఆటకట్టించారు. 

Pradesh man.

ఆజంగఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నసీరుద్దీన్(38) కొన్నేళ్లుగా హత్యాచారాలకు పాల్పడుతున్నాడు. తాగాజాగా ముబారక్‌పూర్ ప్రాంతంలో ఈ నెల 24న మూడు హత్యలు చేశారు. ఓ ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్న భార్యాభర్తలను చంపేశారు. భార్య  మృతదేహంపై అత్యాచారం చేసి, వారి నాలుగు నెలల పసిగుడ్డును చంపేశాడు. పదేళ్ల కూతురిపైనా అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ దృశ్యాలను వీడియోకూడా తీసుకుని తన మరదలికి చూపించాడు. తనకు శవాలతో సెక్స్ చేయడం ఇష్టమని, తాను లైంగిక కోరికలు పుట్టేందుకు డ్రగ్స్ కూడా వాడతానని నసీరుద్దీన్ విచారణలో పోలీసులకు తెలిపాడు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హరియాణాల్లో ఇలాంటి నేరాలకు చేశానని అంగీకరించాడు.