కొట్టడానికి 5 వేలు, చంపడానికి 55 వేలు.. రౌడీల పోస్టర్.. - MicTv.in - Telugu News
mictv telugu

కొట్టడానికి 5 వేలు, చంపడానికి 55 వేలు.. రౌడీల పోస్టర్..

November 5, 2020

bbfb

కాలానికి తగ్గట్టు మారుతూ ఉండాలి. వృత్తి ఏదైనా సరే ప్రచారం తప్పనిసరి. హోటళ్లు, కిరాణా షాపులు, కూరగాయలు, సినిమాలు… వ్యాపారం ఏదైనా యాడ్ ఆకర్షణీయంగా ఉండాలి. చివరకు గూండాయిజమైనా అంతే. ‘నేను రౌడీని. మీకు ఏ పని చేసి పెట్టాలో చెప్పండి..’ అని ప్రతి ఒక్కర్నీ అడగడం ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే కొందరు నేరగాళ్లు ఎంచక్కా పోస్టర్ వదిలారు.  ఇది సోషల్ మీడియా కాలం కాబట్టి గోడలకు అంటించకుండా అందులోనే పోస్ట్ చేశారు. 

నేరాల అడ్డా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఈ అడ్వరైజ్‌మెంట్ సాక్షాత్కరించింది. ‘బెదిరించడానికి జస్ట్ రూ. 1000, కిడ్నాప్‌కు 5000, గాయపడరచడానికి రూ. 10000, హత్య చేయడానికి రూ. 55000’ అని పోస్టర్లో చక్కగా ప్రింట్ చేశారు. ఈ పనులు గ్యారంటీగా చేసి పెడతామని నమ్మకం కలిగించేలా ఓ యవకుడి ఫొటోను కూడా ముద్రించారు. చేతిలో తుపాకీతో దర్జాగా ఉన్నాడు సదరు రౌడీ. ముజఫర్ నగర్‌లో రౌడీలు ఎక్కువే అయినా ఇలా పబ్లిగ్గా రేట్లు ప్రకంటించుకోవడం ఇదే తొలిసారి. పోస్టర్ కాస్తా వైరల్ కావడంతో పోలీసులు ఆ రౌడీల కోసం ఆరా తీశారు. దర్యాప్తులో మరో షాకింగ్ విషయం తెలిసింది. పోస్టర్‌లో ఉన్న నిందితుణ్ని ఓ జవాన్ కొడుకుగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ గ్యాంగ్‌లో మరికొందరు యువకులు కూడా ఉన్నారని, అందరికీ తాము ‘తగిన పని’ని ఉచితంగా చేసి పెడతామని వెల్లడించారు.