ప్రధాని మోదీ విగ్రహం ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీ విగ్రహం ధ్వంసం

March 9, 2018

తమిళనాడులో పెరియార్, పశ్చిమబెంగాల్‌లో శ్యామాప్రసాద్  ముఖర్జీ, త్రిపుర‌లో వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాజాగా  కొందరు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విగ్రహాన్నికూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబీ జిల్లా భగవాన్ పూర్ బహుగర గ్రామంలో జరిగింది.ఈ గ్రామంలో 2014 ఎన్నికల ముందు బీజేపీ నాయకుడు బ్రజేంద్ర నారాయణ్  స్థానిక శివాలయంలో నరేంద్ర మోదీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దానికి గ్రామ ప్రజలు మోదీకి పూజలు  చేసేవారని నారాయణ్ తెలిపారు. మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా ప్రతి రోజూ గ్రామస్తులు పూజలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో విగ్రహాల కూల్చివేతల నేపథ్యంలో బీజేపీ అంటే గిట్టనివారు  మోదీ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై నారాయణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.