మహిళ  ముందు ఎస్ఐ హస్తప్రయోగం.. - MicTv.in - Telugu News
mictv telugu

మహిళ  ముందు ఎస్ఐ హస్తప్రయోగం..

July 1, 2020

Uttar pradesh police officer woman issue

పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే మగవాళ్లకే కాదు, ఆడవాళ్లకు కూడా గుండెలు అదిరిపోతాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మరింత భయపడతారు. మనుషుల్లో అందరూ చెడ్డవాళ్లు ఉండనట్లే, పోలీసుల్లోనూ అందరూ చెడ్డవాళ్లు ఉండరు. కేవలం కొంతమంది గలీజ్ పనులు వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. రక్షక భటుల్లో ఎంత గలీజ గాళ్లు ఉంటారో మరోసారి వీడియోతో సహా బయటపడింది. 

ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ ముందు ఎస్ఐ హస్తప్రయోగం చేశాడు. ఒకపక్క ఆమెతో కబుర్లు చెబుతూనే, మరోపక్క పనికానిచ్చేశాడు. ఆమె ఈ తతంగాన్ని రహస్యంగా వీడియో తీసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా భట్నీ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. భూ వివాదంపై  ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ఎస్ఐ భీష్మ్ పాల్ సింగ్‌  పర్సనల్‌గా మాట్లాడుకుందాం అంటూ గదిలోకి తీసుకెళ్లాడు. తర్వాత ప్యాంటు విప్పి హస్తప్రయోగం మొదలెట్టాడు. ఈ గలీజును ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఐస్ఐ తనతో ఇదివరకు కూడా అలా ప్రవర్తించాడని, ఓ స్నేహితురాలి సలహాతో అని కామపైత్యాన్ని వీడియో తీసి బయటపెట్టాడన్న ఆమె చెప్పారు. ప్రభుత్వం అతణ్ని సస్పెండ్ చేసింది.