రూల్స్ ప్రజలకే..పోలీసుల దేడ్ దిమాక్ ఊరేగింపు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

రూల్స్ ప్రజలకే..పోలీసుల దేడ్ దిమాక్ ఊరేగింపు (వీడియో)

June 5, 2020

Police Rally.

కంచే చేనును మేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను ప్రజలు పాటిస్తున్నారా లేదా అని చూడాల్సిన పోలీసులే ఈ నిబంధనలను గాలికి వదిలేశారు. అంబేద్కర్ నగర్ జిల్లాలోని బస్ఖరీ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీస్ (ఎస్‌హెచ్ఓ) మనోజ్ కుమార్ సింగ్ జైత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. 

దీంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకడానికి పోలీస్ వాహనాన్ని పూలదండలతో అలంకరించి అందులో ఆయన్ను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులతోపాటు మిగతా వారు ఎవరూ భౌతిక దూరం పాటించలేదు, అలాగే మాస్కులు కూడా ధరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎస్పీ అలోక్ ప్రియదర్శి దృష్టికి వెళ్లడంతో ఎస్‌హెచ్ఓను సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఊరేగింపులో పాల్గొన్న మిగతా పోలీసులను లైన్స్‌కు పంపిచారు.