గుర్రమెక్కిన ఎస్ఐకి వాచిపోయింది.. హక్కుల సంఘం నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

గుర్రమెక్కిన ఎస్ఐకి వాచిపోయింది.. హక్కుల సంఘం నోటీస్

August 3, 2020

Uttar pradesh police  rides horse Minors hold the halter.0

గుర్రంపై ఊరేగడం మనదేశ చట్టాల ప్రకారం తప్పేమీ కాదు. కాకపోతే దౌడు తీయడానికి కొన్ని నిబంధనలు తగలడ్డాయి. కానీ తాను ఖాకీ గుడ్డలు వేసుకున్నాను కదా, తనను అడుగే వాడు ఉంటాడా అని బోరవిరుచుకుని ‘కరోనా’ స్వారీ చేశాడో ఎస్ఐ. ఇద్దరు బాలలకు గుర్రం కళ్లేలు అప్పగించి యమధర్మరాజుగా ఊరంతా తిరిగాడు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, జనం ఇళ్లలోంచి రావొద్దని హెచ్చరించుకుంటూ పోయాడు. అయితే బాలలను ఎండలో తిప్పి వారి హక్కులను కాలరాస్తున్న విషయం మాత్రం అతనికి ఆలస్యంగా అర్థమైంది. విషయం బాలల హక్కుల సంఘం దృష్టికి వెళ్లింది. 

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జయంతిపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి రియాజ్ జైదీ కరోనా అవగాహన చర్యల్లో భాగంగానూ గుర్రపు స్వారీ కోరిక తీర్చుకోవడంలో భాగంగానూ గుర్రమెక్కాడు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా బజారునపడ్డాడు. ఇద్దరు పిల్లలు గుర్రం తాళ్లు పట్టుకుని నడించారు. అయ్యగారి దర్జా సోషల్ మీడియాకు ఎక్కింది. పిల్లలతో పని చేయించుకున్నాడని కొందరు బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని, లేఖపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హక్కుల సంఘం అతనికి నోటీసులు జారీ చేసింది.