మంటల్లో బైక్.. వెంటాడి కాపాడిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

మంటల్లో బైక్.. వెంటాడి కాపాడిన పోలీసులు

April 15, 2019

అసలే ఎండలు.. ఆపై నిప్పు! మంటలు అంటుకున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా రివ్వున దూసుకెళ్లిన ఓ అపాచీ బైక్‌ను పోలీసులు సకాలం కాపాడి ముగ్గురి ప్రాణాలను కాపాడారు. ఉత్తరప్రదేశ్‌‌లో ఈ సంఘటన జరిగింది. ఇటావా జాతీయ రహదారిపై బైకులో భార్యభర్తలు తమ కొడుకుతో కలిసి వెళ్తున్నారు. మధ్యలో ఏమైందోగాని, సైలెన్సర్‌పై భాగంలోని బ్యాంగులకు మంటలు అంటుకున్నాయి. వెనుక కూర్చుకున్న భార్య ఆ సంగతి ఏ మాత్రం పట్టించుకోలేదు.  

Uttar Pradesh police saves family who travelling on bike with fire accident on etah national high way

హైవేపై గస్తీ కాస్తున్న పోలీసు వాహనాన్ని దాటుకుని ముందుకు దూసుకుపోయింది బైక్. పోలీసులకు దాని వ్యవహారంపై అనుమానం వచ్చింది. బైక్‌కు మంటలు అంటుకున్నాయని గుర్తించి వెంబడించారు. కానీ రేసర్ మాత్రం మాంచి వేగంతో దూసుకెళ్లాడు. ఎట్టకేలకు పోలీసులు బైక్‌ వద్దకు చేరుకోవడంతో అది ఆగింది. మంటలను చూసిన బైకర్ గుండె గుభేలుమంది పోలీసులు మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.