వలసకూలీలపై దారుణం.. విమానాలు దిగిన వారికీ ఇలాగే చేస్తారా?  - MicTv.in - Telugu News
mictv telugu

వలసకూలీలపై దారుణం.. విమానాలు దిగిన వారికీ ఇలాగే చేస్తారా? 

March 30, 2020

కరోనా.. మన సమాజంలో ఎంత వివక్ష, ఎన్ని ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయో కళ్లకు కడుతోంది. బడాబాబులు ఇప్పటికీ కులాసాగా కార్లలో విచ్చలవిడిగా తిరుగుతోంటే ఆపడానికి చేతులు కూడా రాని పోలీసులు సైకిళ్లపై సొంతూళ్లకు వెళ్తున్న కూలీలను మాత్రం లాఠీలతో విపరీతంగా  కొడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నిరుపేదలు తిండిదొరక్క అల్లాడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పోలీసులు సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలపై అమానుష కాండకు తెగబడ్డారు. వారిపై ప్రమాదకరమైన రసాయనాలను స్ప్రే చేశారు. ముందు జాగ్రత్త చర్య పేరుతో ఈ తతంగం వెలగబెట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారికి అదివరకే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే స్ప్రేవల్ల మరింత అనారోగ్యం సోకొచ్చని హక్కకుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘కరోనా ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వ్యాపిస్తోంది కదా. మరి ఎయిర్ పోర్టుల్లో ఎక్కీదిగే వారిని కూడా ఇలాగే ఎండలో కూర్చోబోట్టి కెమికెల్ స్ప్రే చేస్తారా?’ అని సోషల్ మీడియాలో పోలీసుల తీరును ఎండగడుతున్నాయి. అయితే తనకీ విషయం తెలియదని జిల్లా కలెక్టర్ తప్పించుకున్నాడు.