Uttar Pradesh preeti verma lover issue suit case
mictv telugu

ప్రియుణ్ని చంపేసే సూట్‌కేసులో కుక్కి..

August 9, 2022

వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. దాంపత్య బంధం నుంచి విడిపోయిన వాళ్లు కూడా ఘోరాలకు పాల్పడుతున్నారు. స్త్రీపురుష భేదం లేకుండా పిచ్చి కోపంతోనో, పక్కా పథకంతోనే ఉసురు తీస్తున్నారు. భర్తతో విడిపోయి ప్రేమికుడితో సహజీవనం చేస్తున్న ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పెళ్లికి నిరాకరించాడంతో కసితో ప్రియుణ్ని చంపేసి సూట్ కేసులో కుక్కింది. తర్వాత తీరిగ్గా సూట్ కేసును వదిలించుకోడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయింది.

ఉత్తర ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ప్రీతీవర్మ విడాకులు తీసుకుని ఫిరోజ్ అనే యువకుడితో కలసి ఉంటోంది. నాలుగేళ్లయినా పెళ్లికి అతడు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవాలని ఆమె చాలాసార్లు కోరినా అతడు ఒప్పుకోలేదు. దీంతో ప్రీతి అతని గొంతు కోసింది. తర్వాత మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో కుక్కి లాక్కుని వెళ్తూ పోలీసుల కంటపడింది. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండడంతో పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.