ఆడ, మగ తెలుసుకునేందుకు భార్య కడుపు కోసిన దుర్మార్గుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఆడ, మగ తెలుసుకునేందుకు భార్య కడుపు కోసిన దుర్మార్గుడు

September 21, 2020

bcvbbgnf

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం తీవ్రమైన నేరం. ఎవరు కూడా పుట్టబోయే బిడ్డ ఎవరనేది చెప్పేందుకు వీలు లేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని తెలుసుకోవాలని అనుకున్నాడు. దీని కోసం దారుణానికి ఒడిగట్టాడు. భార్య కడుపు కోసం లింగ నిర్ధారణకు యత్నించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పన్నాలాల్‌ అనే వ్యక్తికి ఐదుగురు ఆడబిడ్డలు జన్మించారు. మరోసారి కొడుకు కోసం ఆరాటపడుతున్న అతడు మరోసారి భార్య గర్భం దాల్చడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఈసారైనా మగబిడ్డకు జన్మనిస్తుందా లేదా అని అనుమానించాడు. వెంటనే పదునైన కత్తి తీసుకొని ఆమె పొట్టను కోశాడు. గర్భాశయాన్ని చీల్చే క్రమంలో నెత్తుటి మడుగులో ఆమె పడిపోయింది. వెంటనే స్థానికులు గుర్తించి  బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇది స్థానికంగా సంచలనం రేపింది. కాగా యూపీలో ఆడ శిశువులు పుట్టిన వెంటనే వారిని పడేయడమో, అమ్మేయడమో జరుగుతూనే ఉన్నాయి.