ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. రాష్ట్ర రాజధాని లక్నోలో ఉన్న రాజ్‌భవన్‌ను 10 రోజుల్లో ఖాళీ చేయాలని.. లేకపోతె డైనమెట్లతో భవనాన్ని పేలుస్తామని లేఖలో ఉంది. జార్ఖండ్ త్రితీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ పేరుతో ఈ బెదిరింపు లేఖ వచ్చింది.
దీంతో యూపీ హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనపై హోంశాఖ సెక్యూరిటీ అదనపు డైరెక్టరు జనరల్, ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టరు జనరల్‌లు దర్యాప్తు ప్రారంభించారు. రాజ్‌భవన్‌కు వచ్చిన లేఖపై పోలీసు ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హేమంత్ రావుకు నివేదిక సమర్పించారు. ఈ బెదిరింపు లేఖపై హజ్రత్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 నుంచి 2016 వరకు ఆనందిబెన్ పటేల్ గుజరాత్ సీఎంగా పనిచేశారు. తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా పనిచేసి, ఈ ఏడాది జులై 20న యూపీ గవర్నరుగా బదిలీ అయ్యారు.