అటెండెన్స్ పలకలేదని..  - MicTv.in - Telugu News
mictv telugu

అటెండెన్స్ పలకలేదని.. 

August 31, 2017

ఉత్తరప్రదేశ్ లోని ఓ స్కూల్లో  అప్పుడే  క్లాస్ లోకి వచ్చిన టీచర్ అటెండెన్స్ తీసుకుంటోంది.. విద్యార్థులందరూ వరుసగా అటెండెన్స్ పలుకుతున్నారు. అందులో ఓ విద్యార్థి అటెండెన్స్ సరిగ్గా పలకలేదు. అంతే  టీచర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిల్లాడిని లేపి ఆ చెంప, ఈ చెంపా వాయించింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఒక్క నిమిషంలోనే  40కి మీదనే చెంపదెబ్బలు వర్షం కురిపించింది. ఇదంతా క్లాస్ లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. టీచర్ వ్యవహారంపై సీరియస్ అయిన బాలుడి తల్లిదండ్రులు టీచర్ పై వెంటనే చర్య తీసుకోవాలని ఆందోళనకు దిగారు.స్కూల్ యాజమాన్యం గుడ.. చెంప దెబ్బలు కొట్టుట్ల రికార్డ్ కెక్కిన ఆ టీచరమ్మకు సస్పెన్షన్ అనే సన్మానం జేశే పనిలో ఉన్నరట.