లాక్ డౌన్ దిశగా మరో రాష్ట్రం అడుగులు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్ డౌన్ దిశగా మరో రాష్ట్రం అడుగులు

July 13, 2020

b cb

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. లాక్ డౌన్ పూర్తైన తరువాత కేసుల తీవ్రత పెరిగింది. దీంతో ఎన్నో నగరాలు, రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు, పూణే నగరాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలో వారాంతరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. వచ్చే శనివారం నుంచి ఈ తరహా లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. ఈ లాక్‌డౌన్‌ జులై చివరి వరకు కొనసాగనుంది. ప్రత్యేకంగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో మార్కెట్లు, వ్యాపారాలు మూసి ఉంటాయని తెలిపారు.