భర్త నల్లగా ఉన్నాడని తగలబెట్టింది.. - MicTv.in - Telugu News
mictv telugu

భర్త నల్లగా ఉన్నాడని తగలబెట్టింది..

April 17, 2019

మన దేశంలో వర్ణవివక్ష రూపాలు అనేకం. కొందరిని గ్రామాలకు దూరంగా పెట్టడం దగ్గర్నుంచి చంపడం వరకు లెక్కలేనన్ని నేరాలూ, ఘోరాలు. చివరకు రక్తసంబంధాలు, అనుబంధాలు ఉన్న వాళ్లను కూడా రంగు పేరుతో హింసించేస్తుంటారు. తాజాగా ఓ మహా ఇల్లాలు తన భర్త నల్లగా ఉన్నాడని అతణ్ని తగలబెట్టి చంపేసింది.

Uttar Pradesh’s Bareilly, a woman allegedly killed her husband by setting him on fire because of his dark complexion.

ఉత్తరప్రదేశ్‌  బరేలిలో జిల్లాలో ఈ ఘోరం జరిగింది.  ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీరి అనుబంధానికి గుర్తుగా 5 నెలల పాప కూడా ఉంది. ప్రేమ్‌శ్రీ తాను తెల్లగా ఉన్నానని, భర్త మాత్రం నల్లంగా ఉన్నాడని, తన జీవితం ఇంతేనా తెగ కుమిలిపోయేది. రంగుపేరుతో అతణ్ని తరచూ దూషించేంది. రంగెలా ఉంటేనేం, నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని పెద్దలు సర్దిపెట్టేవారు. కానీ ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. సోమవారం రాత్రి భర్త నిద్రపోతుండగా, అతనిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. అతడు తీవ్రగాయాలతో చనిపోయాడు. ప్రేమ్‌శ్రీ కాళ్లకు గాయాలయ్యాయి. సత్యవీర్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.