అక్కలూ,శెల్లెండ్లకు...బస్సు ఫ్రీ ! రాఖీ పండ్గ ఆఫర్...! - MicTv.in - Telugu News
mictv telugu

అక్కలూ,శెల్లెండ్లకు…బస్సు ఫ్రీ ! రాఖీ పండ్గ ఆఫర్…!

August 4, 2017

రాఖీ పండ్గ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ రవాణా సంస్ధ అక్కడి ఆడోళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.6వతేదీ అర్ధరాత్రి నుంచి 7వతేదీ అర్ధరాత్రి దాకా రాష్ట్రం మొత్తం ప్రీగ ఆడోళ్లు బస్సులల్ల తిర్గచ్చట.ఒక్క ఏసీ బస్సులల్ల తప్పితే మిగతా అన్ని బస్సుల్లో రాష్ట్రంల ఎక్కడికైనా ఫిరీగనే ఎక్కిచ్చుక పోతరట.అట్లనే రాఖీ పండ్గ ఆఫర్ కింద గ బిఎస్ఎన్ఎల్ నెట్ వర్కోళ్లు గుడ తమ కస్టమర్లకు ‘రాఖీ పె సౌగత్‌’ అని  కొన్ని స్పెషల్  రీఛార్జ్‌ ప్లాన్లను ప్రకటించింది,మల్లా ఈ ఆఫర్  కేవలం వాళ్ల ప్రీపేయిడ్ కస్టమర్లకేనట.అబ్బ గ ఉత్తరప్రదేశ్ బస్సు ఆఫర్ మనతాడగుడ పెడితే మంచిగుండు గదా…అట్లనే ఎం.పి కవితక్క సిస్టర్ 4 చేంజ్ అని..అందరు అక్కశెల్లెండ్లు అన్నలకు,తమ్ముళ్లకు  హెల్మెట్లు పంచాలని చెప్పింది గదా..మరి రాఖీ పండ్గ ఆఫర్ కింద దుక్నపోల్లు  హెల్మెట్ మీద గుడ డిస్కౌంట్లు వెడితే మంచిగుండు అనిపిస్తుంది గదా..