సీఎం అవినీతి కేసుపై సీబీఐ దర్యాప్తు.. హైకోర్టు ఆదేశం  - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం అవినీతి కేసుపై సీబీఐ దర్యాప్తు.. హైకోర్టు ఆదేశం 

October 29, 2020

Uttarakhand chief minister corruption cbi inquiry

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రికి  హైకోర్టు షాకిచ్చింది. ఏకంగా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌పై ఓ పోస్ట్ భర్తీ విషయంలో లంచాల బాగోతానికి తెరతీశారన్న ఆరోపణల కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

త్రివేంద్ర 2016లోజార్ఖండ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగం భర్తీ విషయంలో అవినీతి జరిగినట్లు కేసు నమోదైంది. త్రివేంద్ర అనుమతితోనే ఈ వ్యవహారం నడిచిందని అభియోగాలు ఉన్నాయి. ఉమేశ్ శర్మ, శివప్రసాద్‌ సేమ్వాల్‌లు దీనిపై కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు సీబీఐతో నిజానిజాలు బయటపడతాయని పేర్కొంది. కాగా, తాను అమాయకుడినంటూ త్రివేంద్ర హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు.