Uttarakhand government provides opportunity to spend time in jail
mictv telugu

గ్రహ దోషాలు పోవాలంటే ఈ జైలుకి రండి.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వింత ఆఫర్

September 28, 2022

జైళ్లలో సాధారణంగా నేరం చేసిన వారు ఉంటారు. అయితే ఈ మధ్య జైలు టూరిజం కూడా పెరిగిపోతోంది. అయితే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారిని కొన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం కల్పిస్తుంది. దీనికి కొంత రుసుమును వసూలు చేస్తుంది. కొన్ని గంటల నుంచి రోజుల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుండగా, జైల్లో ఖైదీలకు ఇచ్చే దుస్తులు, ఆహారం అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం 1903లో నిర్మించిన హల్ద్వానీ జైలును వాడుకుంటుంది. ఇందులో ఆరు క్వార్టర్లు ఉండగా, పాత ఆయుధశాల కూడా ఉంది. అటు గ్రహదోషాల నిమిత్తం కొందరు జ్యోతిష్కులు జైలు శిక్ష సూచిస్తుండగా, వారి నుంచి జైలు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వచ్చాయి. జైల్లో గడిపే అవకాశం కల్పించమని తరచూ సీనియర్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు వస్తున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆ ప్రాంతానికి చెందిన మృత్యుంజయ్ ఓజా అనే జ్యోతిస్కుడు మాట్లాడుతూ.. కొందరి జాతకాల ప్రకారం శని, అంగారకుడితో సహా మూడు ఖగోళ వస్తువులు అననుకూల స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. దీనిని నివారించడానికి కొన్ని రోజులు జైల్లో గడపమని చెప్తాం. దీంతో వారి దోషం పోతుందని వెల్లడించాడు. ఇలా జైలు టూరిజం కోసం వినతులు వస్తుండడంతో ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఒక్కరాత్రికి రూ. 500 వసూలు చేయనుంది.