రోడ్డు కోసం సైకిలెక్కిన మంత్రి  - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డు కోసం సైకిలెక్కిన మంత్రి 

September 9, 2017

ఈమె ఉత్తరాఖాండ్ మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి.  మేడం ఇలా సైకిలెందుకు ఎక్కిందంటే  ఆ రాష్ట్రంలో జాతీయ హైవేల కోసం. కేంద్రానికి  తమ డిమాండ్లను కొత్త పద్ధతిలో చెప్పేందుకు  ఉత్తరాఖాండ్ ప్రభుత్వం  నిర్ణయించుకుంది.  ఈ నెల ఈ నెల 17న డెహ్రాడూన్‌ నుంచి హరిద్వార్‌కు 500 మంది మహిళలతో సైకిల్‌ ర్యాలీ చేయించేందుకు ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. ఈ ర్యాలీకి  మంత్రి రేఖ ఆర్య నాయకత్వం వహిస్తారు.. అందుకోసం ఆమె ట్రయల్ వేస్తున్నారు ఇలాగా.  సైకిల్ యాత్ర 55 కి.మీ. జరుగుతుంది. డెహ్రాడూన్‌‌- హరిద్వార్‌ మార్గంలో పలు పరిశ్రమలు ఉండడంతో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ఈ మార్గంలో జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.