భారత్ మానవత్వం.. నేపాల్ బాలిక కోసం తెరుచుకున్న వంతెన  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ మానవత్వం.. నేపాల్ బాలిక కోసం తెరుచుకున్న వంతెన 

September 29, 2020

Uttarakhand: Pithoragarh Suspension Bridge Opened At Midnight For Ailing Nepali Girl

సరిహద్దు వివాదాన్ని తెరపైకి తెచ్చి కయ్యానికి సై అంటున్న నేపాల్ భారత్‌పై దుశ్చర్యలకు  పాల్పడుతున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం భారత్‌కు చెందిన ముగ్గురు పుశువుల కాపరులపై అక్కడి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపగా.. ఈ ఘటనలో ఓ వక్తి గాయపడగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఇలా సందు దొరికితే నేపాల్ భారత్ మీద కాలు దువ్వుతోంది. అయితే భారత్ మాత్రం నేపాల్ విషయంలో మానవత్వం చాటుకుంది. ఉత్తరాఖండ్‌ పితోరాగఢ్‌ జిల్లాలోని అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జిని భారత్‌ సోమవారం అర్ధరాత్రి అరగంట పాటు తెరిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నేపాలీ బాలికకి తక్షణ వైద్య సాయం అందించేందుకు అంతర్జాతీయ మార్గాన్ని తెరిచి మానవత్వాన్ని చాటుకుంది. 

పొత్తి కడుపులో గడ్డలతో బాధపడుతున్న నేపాలీ బాలిక పితోరాగఢ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వంతెన ఒక్కటే మార్గం కావడంతో.. నేపాల్ ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న బాలిక ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు  ధార్చులా డిప్యూటీ కలెక్టర్ అర గంట పాటు వంతెనను తెరిచి ఉంచేందుకు అనుమతించినట్టు తెలిపారు. ఆ అమ్మాయితో పాటు ఇరువైపుల నుంచి వచ్చిన జనం వంతెన దాటారు. చికిత్స కోసం సరిహద్దు వెంబడి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని నేపాల్ అధికారులను కోరినట్లు బాలిక తల్లి రేవతిదేవి వెల్లడించారు. కాగా, భారత్ భూభాగాన్ని తమ దేశంలో కలిపేస్తూ నేపాల్ ప్రభుత్వం ఒంటిపోకడగా చట్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీరాముడు కూడా తమవాడే అంటూ ఆ దేశ ప్రధాని కేపి శర్మ ప్రకటించి వివాదాన్ని కూడా సృష్టించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఇండో – నేపాల్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నా భారత్ శాంతిగా మానవత్వం చాటుకుంది.