జాతికుక్కలపై ఊరకుక్క  పైచేయి.. పోలీసు కొలువు కొట్టేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

జాతికుక్కలపై ఊరకుక్క  పైచేయి.. పోలీసు కొలువు కొట్టేసింది.. 

November 20, 2019

కుక్క ఏదైనా కుక్కే. విశ్వాసంతోపాటు, వాసన పసిగట్టడం వంటి చాలా విషయాల్లో కుక్కలు సమానమే. కానీ మట్టిలో మాణిక్యాలు అన్నట్లు కొన్ని కుక్కలు అసమాన ప్రతిభ చాటుతుంటాయి. జర్మన్ షెపర్డ్, లాబ్రాడర్, గ్రేహౌండ్.. వంటి జాతికుక్కలకు టాలెంట్ ఎక్కువ. అందుకు పోలీసులు వాటికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఊరకుక్కలను నిర్దాక్షిణ్యంగా తరిమేస్తుంటారు. కానీ ఊరకుక్కల్లో ఖతర్నాక్ టాలెంట్ ఉంటుందని తేలింది. 

ఉత్తరాఖండ్ పోలీసులకు తిండీతిప్పల కోసం గల్లీలు తిరిగే ఊరకుక్క ఒకటి కనిపించింది. దాని తెలివితేటలకు మురిసి చేరదీసి శిక్షణ ఇచ్చారు. అంతే. అది రన్నింగ్, జంపింగ్, వాసన పసిగట్టడం వంటి జాగిలం విద్యల్లో రాటుదేలిపోయింది. జర్మన్ షెపర్డ్ వంటి నానా జాతికుక్కులపై పైచేయి సాధించింది. వాటికంటే ముందే టార్గెట్లు పూర్తి చేస్తూ పోలీసులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. లక్షలు పోసి కొనుక్కున్న జాతి కుక్కలను ఊరికే దొరికిన ఈ ఊరకుక్కే అవలీలగా ఓడగొడుతోందని వారు చెబుతున్నారు. దీని వీడియోలను షేర్ చూస్తూ తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియో చివర్లో సదరు గ్రామసింహం  ప్రతిభను మీరూ చూడొచ్చు.