స్కూలు తెరిచిన రోజే కరోనా.. 15 మంది పిల్లలు క్వారంటైన్ - MicTv.in - Telugu News
mictv telugu

స్కూలు తెరిచిన రోజే కరోనా.. 15 మంది పిల్లలు క్వారంటైన్

November 3, 2020

 Lockdown

కరోనా వైరస్ ఎక్కడికీ పోలేదు. మన మధ్య ఇంకా తచ్చాడుతూనే ఉంది. అందరూ ఇళ్లకే పరిమితమైతే పూట గడవడం, ప్రభుత్వాలకు ఆదాయం రావడం కష్టం కనుక దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రోజూ వేలకొద్దీ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్కూళ్లను తెరుచుకోడానికి కూడా అనుమతివ్వడం తెలిసిందే. అయితే స్కూళ్లలో సరైన ఆరోగ్య పరీక్షలు జరగడం లేదని తెలుస్తోంది. కేవలం శానిటైజ్, మాస్కులతో కరోనాను అడ్డుకోవడం సాధ్యం కాదని  తేలిపోయింది. 

ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు తెరిచిన తొలి రోజే ఓ స్కూల్లో కలకలం రేగింది.  అల్మోరాలో కరోనా వైరస్ సోకిన 12వ తరగతి విద్యార్థికి ఆ లక్షణాలు కనిపించకపోవడంతో నేరుగా తరగతి గదిలోకి వచ్చి కూర్చుకున్నాడు. తర్వాత అతని తండ్రి స్కూలు వచ్చిన తమ ఇంట్లో కొందరికి కరోనా సోకిందని చెప్పాడు. దీంతో ఉపాధ్యాయులు అతణ్ని వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లి పరీక్ష చేయించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. తరగతికి హాజరైన మొత్తం 15 మంది విద్యార్థును హోం క్వారంటైన్ చేశారు. థర్మామీటర్‌తో ఆ విద్యార్థిని పరీక్ష చేశామని, జ్వరం లేకపోవడంతో క్లాసుకు పంపామని స్కూలు సిబ్బంది చెబుతున్నారు. స్కూలంతా శానిటైజ్ చేసి, మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు అతడు ఇంట్లో చెప్పకుండానే స్కూలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి.