ఇకపై రోజుకు 20వేల టెస్టులు చేస్తాం..సీఎం యోగి - Telugu News - Mic tv
mictv telugu

ఇకపై రోజుకు 20వేల టెస్టులు చేస్తాం..సీఎం యోగి

May 31, 2020

Yogi adityanath.

ఇకపై రోజుకు 20 వేల టెస్టులు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇఫ్పటివరకూ రోజుకు పది వేల టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యూపీకి చెందిన వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చారు. 

దీంతో టెస్టుల సంఖ్యాను పెంచాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..’మార్చి మొదటివారంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. అప్పుడు రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదు. ఇప్పుడు 30 ల్యాబులు ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ కోసమే ప్రత్యేకంగా 50 హాస్పిటల్ ఏర్పాటు చేశాం. 80 వేల పరుపులు సిద్ధం చేశాం. ఇప్పటివరకూ 2,36,00 టెస్టులు చేశాం. 73 లక్షల కుటుంబాల్లో 3.69 కోట్ల మందిపై ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1063 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. ఇప్పటివరకూ 7,700 మందికి కరోనా సోకింది. 4651 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 213 మంది చనిపోయారు.’ అని తెలిపారు.